గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మైనర్ విద్యార్థినిపై అత్యాచారం.. కామాంధుడిని కాల్చి చంపిన పోలీసులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ కామాంధుడు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. పదో తరగతి చదువుతున్న బాలికను అత్యాచారం చేసి, ఆపై ఆమె ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ఒకరిని మీరట్ పోలీసులు కాల్చాల్సి నిర్బంధ పరిస్థితి వచ్చింది. 
 
పోలీసు అధికారులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నిందితులను కోర్టుకు తీసుకుని వెళుతుండగా, వారిలో ఒకడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతనిపై ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఈఘటనలో అతనికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని మీరట్ రూరల్ ఎస్పీ కేశవ్ మిశ్రా తెలిపారు.
 
కాగా, ఈ కేసులో టెన్త్ విద్యార్థినిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత యువతి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు నిందితుల పేర్లను వెల్లడిస్తూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. ఆ లేఖ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. 
 
నిందితుల్లో లఖన్ (18) అనే యువకుడు పోలీసు కస్టడీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని కేశవ్ వెల్లడించారు. కోర్టుకు తీసుకుని వెళుతున్న క్రమంలో ఓ పోలీసు వద్ద ఉన్న ఉన్న తుపాకిని లాక్కొని, సమీపంలోని చెరుకు తోటలోకి పారిపోయాడని, దీంతో అతన్ని షూట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.