శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 మార్చి 2021 (13:40 IST)

రహదారి పక్కనే మహిళ శవం దగ్ధం: అత్యాచారం చేసి తగులబెట్టేశారా?

తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సమీపంలో కర్ణి రహదారి పక్కన ఓ మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో సోమవారం ఉదయం స్థానికులు గుర్తించారు.
 
మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి వుండటంతో తొలుత ఆ మృతదేహం పురుషుడిదా స్త్రీదా అనే అనుమానం కలిగింది. ఐతే కాలిన శవానికి కాస్తంత దూరంలో మహిళకు సంబంధించిన కొన్ని వస్తువులు లభించాయి. దీనితో దగ్ధం చేసిన మృతదేహం మహిళదేనని గుర్తించారు.
 
పోలీసులు ఇంకా ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నారు, వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఐతే దుండగులు ఎవరైనా మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి దగ్ధం చేశారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.