విక్రమ్-1 విజయవంతం.. లాంచ్ వ్యూ గ్యాలరీలో మంత్రి లోకేశ్, దేవాన్ష్.. మోదీ కితాబు
Nara Lokesh
షార్‌లోని ఒకటవ ప్రయోగ వేదిక నుంచి విక్రమ్-1 రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు షార్‌లోని లాంచ్ వ్యూ గ్యాలరీకి మంత్రి లోకేశ్, దేవాన్ష్ హాజరయ్యారు. రాకెట్ విజయవంతంగా గమ్యాన్ని చేరుకోవడంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ తొలి ప్రయోగంలో విక్రమ్-1 రాకెట్ నాలుగు చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లింది. వీటిలో గ్రహాస్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ పేలోడ్లు ఉన్నాయి.
భారత తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్కైరూట్ బృందానికి ఫోన్ చేసి అభినందించారు. సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో సంబరాలు జరుగుతున్న సమయంలో వచ్చిన ఈ కాల్‌లో యువ శాస్త్రవేత్తల కృషిని ప్రధాని ప్రశంసించారు.
