1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Deep depression LIVE: Weather system likely to turn into Cyclone ‘Akvan’ today; Andhra Pradesh on alert

వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్ర తీరానికి చేరుకోనున్న అక్వాన్ తుఫాను

Heavy Rain
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ, ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 8 కి.మీ వేగంతో కదిలినట్లు వాతావరణశాఖ తెలిపింది.
 
ప్రస్తుతం ఇది అండమాన్‌కు 640 కి.మీ. చెన్నైకు 760 కి.మీ, విశాఖకు 870 కి.మీ, గోపాల్‌పూర్‌కు 980 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. దక్షిణ మధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సోమవారం సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశముందని తెలిపింది. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మారే వీలుందని పేర్కొంది. 
 
ఆ తదుపరి 48 గంటల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ తుపానుకు ఇరాన్‌ ‘అక్వాన్‌’గా నామకరణం చేసింది. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్‌ సూచించారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబుల కలకలం