ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. తన ఫ్లాట్‌కు పిలిచి బాలికపై అత్యాచారం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషాలో ఒక దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ బాలికను తన ఫ్లాట్‌కు పిలిపించి అత్యాచారం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బీఎస్సీ విద్యార్థి విశాల్ కిరార్ మూడు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో 16 ఏళ్ల బాలికను కలిశాడు. ఆ తర్వాత నవంబరు 14వ తేదీన విశాల్ ఆమెను తన ఫ్లాట్‌కు ఆహ్వానించాడు. ఆమె ఫ్లాట్‌కు రాగానే, విశాల్ ఆమెకు బీర్ తాగించి అత్యాచారం చేశాడు.
ఆ బాలిక తీవ్ర రక్తస్రావానికి గురై, ఆమె ఆరోగ్యం క్షీణించింది.. విశాల్ ఆమెను ఫ్లాట్‌లో వదిలి పారిపోయాడు. ఒక వైద్య విద్యార్థి, మరో ఇద్దరు యువకులు.. బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి.. 48 గంటల్లోపే అతడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం, ఇతర సంబంధిత సెక్షన్ల కింద అధికారులు విశాల్‌పై కేసు నమోదు చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఫ్లాట్‌కు పిలిపించి బాలికపై అత్యాచారం మధ్యప్రదేశ్‌లోని విదిషా ప్రాంతంలో చోటు చేసుకున్న దారుణ ఘటన బీఎస్సీ స్టూడెంట్ విశాల్ కిరార్‌కు 3 నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలిక(16) పరిచయం ఈ క్రమంలోనే నవంబర్ 14న ఆమెను తన ఫ్లాట్‌కు పిలిపించిన విశాల్ ఫ్లాట్‌కు రాగానే బీర్ తాగిపించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ విశాల్ తీవ్ర రక్తస్రావమై బాలిక ఆరోగ్యం క్షీణించడంతో.. ఫ్లాట్‌లోనే ఆమెను వదిలేసి విశాల్ పరార్ ఓ మెడికల్ విద్యార్థిని, మరో ఇద్దరు యువకులు.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి.. 48 గంటల్లో పట్టుకున్న పోలీసులు విశాల్‌పై పోక్సో సహా సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేసిన అధికారులు
— PulseNewsBreaking (@pulsenewsbreak) November 19, 2026

