వీకెండ్ స్పెషల్: చికెన్ లివర్ ఫ్రై..!
వీకెండ్ స్పెషల్: చికెన్ లివర్ ఫ్రై
కావలసిన పదార్థాలు :
లివర్ - పావుకేజీ
ఉప్పు - తగినంత
నూనె - ఒక టేబుల్ స్పూన్
కారం - మూడు చెంచాలు
అల్లం వెల్లుల్లి పేస్టు - 3 చెంచాలు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - ఒక కట్ట
తయారు చేయండి ఇలా :
మొదట చిక్కెన్ లివర్‌ను శుభ్రంగా కడుక్కుని, ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి స్టౌమీద పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గుతుండగా నీళ్ళు వస్తాయి అవన్నీ ఆవిరి అయిపోయాక అల్లంవెల్లుల్లి పేస్టు, నూనె వేసి బాగా ఎర్రగా వేయించి, చివరిగా కొత్తిమీర వేసుకుని దించుకోవాలి. అంతే ఘుమఘుమలాడే చిక్కెన్ లివర్ రెడీ.