1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
  4. Weekend special: Healthy and tasty variety egg dosa

వీకెండ్ స్పెషల్ : హెల్దీ అండ్ టేస్టీ వెరైటీ ఎగ్ దోసె!

Weekend special: Healthy and tasty variety egg dosa
ఈ వీకెండ్ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్, ఈవెనింగ్స్ టిఫిన్‌గా వెరైటీ ఎగ్ దోసె ట్రై చేయండి. గుడ్డు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 
 
ఎగ్‌లో న్యూట్రీషియన్, ప్రోటీనులు అధికంగా ఉంటాయి. అందుకే ఎగ్‌తో చేసే వెరైటీ దోసె హెల్దీ రిసిపీ. గుడ్డులోని ఐరన్, క్యాల్షియం మన శరీరానికి చాలా అవసరం అవుతుంది. 
 
ఎగ్ ఆమ్లెట్ ఎప్పుడు వండినట్లు వండితో కొంచెం బోరుకొడుతుంది కాబట్టి, కొంచెం డిఫరెంట్‌గా టేస్ట్‌గా వెరైటీ ఎగ్ దోసెను ట్రై చేయండి. 
 
కావల్సిన పదార్థాలు: 
బియ్యంపిండి: రెండు కప్పులు
కోడిగుడ్లు : నాలుగు
పచ్చిమిర్చి: ఒక టీ స్పూన్ 
మిరియాలపొడి: ఒక టీ స్పూన్ 
పసుపు: ఒక టీ స్పూన్ 
కారం: ఒక టీ స్పూన్ 
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: కొద్దిగా
నూనె: సరిపడా
ఉల్లిపాయ తరుగు : అరకప్పు 
టమోటో తరుగు : అరకప్పు
 
తయారీ విధానం : 
ముందుగా దోసెల కోసం సిద్ధం చేసుకున్న బియ్యం పిండిలో, ఉల్లి, టమోటో, పచ్చిమిర్చిని చేర్చుకోవాలి. ఇంకా పెప్పర్ పౌడర్, పసుపు, కారం, కొత్తిమీర తరుగు, ఉప్పును వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. ఇందులో రెండు గుడ్లను పగులగొట్టి పోసి ఎగ్ బీటర్‌తో బీట్ చేయాలి.
 
తర్వాత ఫ్లాట్ ఫ్రైయింగ్ పాన్ స్టౌమీద పెట్టి, వేడయ్యాక ఈ మిశ్రమాన్ని దోసెలుగా పోసి.. ఇరువైపులా దోరగా వచ్చేంతవరకు ఉడికించి.. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే వెరైటీ ఎగ్ దోసె రెడీ.
About Writer
Selvi