1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. If crow loudly ariste in house before? what will happen?

కాకి ఇంటి ముందు గట్టిగా అరిస్తే... ఏం జరుగుతుందంటే...

కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం. జంతువులు, పక్షులు హిందూ సాంప్రదాయంతో అనేక నమ్మకాలు కనక్టయి ఉంటాయి. మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని, మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని పెద్దలు చెబుతు

crow
కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం. జంతువులు, పక్షులు హిందూ సాంప్రదాయంతో అనేక నమ్మకాలు కనక్టయి ఉంటాయి. మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని, మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. అలగే కాకి గురించి కూడా చాలా విషయాలున్నాయి. అవెంటో తెలుసుకుందాం.
 
మన పూర్వీకుల చెప్పిన ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు. అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు. మనం వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తిచేస్తారని సంకేతం. నీళ్ళు నిండుగా ఉన్న కుండవై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. నోటితో కాకి ఏదైనా పట్టుకుని దాన్ని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం.
 
కాకి మాంసం ముక్కను పట్టుకెళుతూ క్రింద ఏ వ్యక్తిపైనా పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని విశ్వాసం. కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు. కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చుని అరిస్తే ఆ స్థల యజమాని కానీ, లేకుంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు సమస్యల్లో పడుతారు. 
 
ఒక వ్యక్తి తలమీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. కాకి మహిళ ఒళ్ళోగాని, తలపై గానీ కూర్చుంటే భర్త సమస్యల్లో పడతాడని సంకేతం. సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుంచి చూస్తే ద్రవ్యలాభం పొందుతారు. కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తి మరణించడం ఖాయమని జ్యోతిష్యులు చెబుతున్నారు.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
బుధవారం (20-06-2018) దినఫలాలు - పుణ్యకార్యాల్లో చురుకుగా...