ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (12:54 IST)

పావురాలు ఇంట్లో ఉంటే ధనం తగ్గిపోతుందా?

ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే చాలా మంచిదని కొంతమంది పెద్దవాళ్లు చెబుతుంటారు. కానీ కొన్ని మాత్రం చాలా హానికరం. వాటికి ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంటికి మంచిది కాదని అలాగే పేదరికం వెంటాడుతుందని వాస్తు

ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే చాలా మంచిదని కొంతమంది పెద్దవాళ్లు చెబుతుంటారు. కానీ కొన్ని మాత్రం చాలా హానికరం. వాటికి ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంటికి మంచిది కాదని అలాగే పేదరికం వెంటాడుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది.
 
ఇంట్లో పావురం ఉండడం వలన ఇంట్లో ధనం తగ్గిపోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ ఇంట్లో తెలియకుండా పావురం గూడు పెట్టుకుని ఉంటే వెంటనే తొలగించాలి. తేనెటీగలు పేర్చే తేనెతుట్టె ఇంట్లో ఉంటే మంచిది కాదు. ఇవి దురదృష్టానికి కారణమవుతాయి. ఒకవేళ ఇంటి ఆవరణలో తేనెటీగలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలి. అప్పుడే మంచి విషయాలు జరుగుతాయి.