శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 జూన్ 2018 (10:57 IST)

నిజామాబాద్: గెస్ట్‌హౌస్ ఖాళీ చేయని ఎంపీపీ.. మహిళ ఛాతిపై కాలితో తన్నాడు..

నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రజా ప్రతినిధి ఓవరాక్షన్ చేశాడు. ఓ మహిళను అకారణంగా దూషించడంతో పాటు ఆమె ఛాతీపై తన్నాడు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎంపీపీ గోపి. ధర్పల్లి గ్రామానికి రాజవ్వ కుటు

నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రజా ప్రతినిధి ఓవరాక్షన్ చేశాడు. ఓ మహిళను అకారణంగా దూషించడంతో పాటు ఆమె ఛాతీపై తన్నాడు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎంపీపీ గోపి. ధర్పల్లి గ్రామానికి రాజవ్వ కుటుంబానికి.. ఎంపీపీ గోపికి మధ్య ఆస్తి వివాదాలున్నాయి. తన కొంతకాలం క్రితం గోపి తన గెస్ట్‌హౌస్‌ను రాజవ్వకు అమ్మాడు. దీనికోసం 33 లక్షల రూపాయలు చెల్లించి.. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది రాజవ్వ. 
 
కానీ గోపి ఇప్పటికీ గెస్ట్‌హౌస్‌ ఖాళీ చేయకుండా.. తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అతని ఇంటి వద్ద బాధితురాలు ఆందోళన చేయడంతో.. రేట్ పెరిగిందని.. మరిన్ని డబ్బులు ఇస్తేనే ఖాళీ చేస్తానని చెప్పాడు. అయితే రాజవ్వ అతడ్ని చెప్పుతో కొట్టింది. 
 
వెంటనే ఆమె ఛాతిపై కాలితో.. ఆమెను దూషించాడు గోపి. దీంతో ఆ పక్కనే ఉన్న సదరు మహిళ కుటుంబ సభ్యులు ఎంపీపీని తోసేశారు. రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదుతో గోపిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.