శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (05:31 IST)

శుభోదయం : ఈ రోజు రాశిఫలితాలు 23-10-2017

మేషం: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ఆహార వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరగలదు. వారసత్త్వపు ఆస్తుల పంపకం జరుగుతుంది. ఎవర

మేషం: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ఆహార వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరగలదు. వారసత్త్వపు ఆస్తుల పంపకం జరుగుతుంది. ఎవరికైన ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. జాగ్రత్త వహించండి.
 
వృషభం: కీలకమైన వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల సమర్థతకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు.
 
మిథునం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. సమయానికి కావలసిన పత్రాలు, వస్తువులు కనిపించ ఇబ్బంది పడతారు. సమయానికి కావలసిన పత్రాలు, వస్తువులు కనిపించక ఇబ్బంది పడతారు.
 
కర్కాటకం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. నిలిపివేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. రవాణా కార్యక్రమాల్లో చురుకుదనం కానవస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు. స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తుంది.
 
సింహం: విద్యార్థినులకు క్యాంపస్ సెలక్షన్‌లో నిరుత్సాహం అవసరం. రుణాల కోసం అన్వేషిస్తారు. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. స్త్రీల సృజనాత్మకతకు, ప్రతిభకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కన్య: మీ శ్రీమతి మొండి వైఖరి మీకు ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
తుల: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునప్పుడు మెళకువ అవసరం. చిన్ననాటి మిత్రులు అనుకోకుండా తారసపడతారు. సోదరీ సోదరుల మధ్య సఖ్యత లోపం,  పట్టింపులు అధికంగా ఉంటాయి.
 
వృశ్చికం: మీ శ్రీమతి వైఖరిలో వచ్చిన మార్పు సంతోషం కలిగిస్తుంది. విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు లాభిస్తాయి. మీ ప్రమేయం లేకున్నా మాటపడాల్సి వస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది.
 
ధనస్సు: ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కీలకమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. ఎదుటివారిని నొప్పించకూడదనే స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. దైవ దర్శనాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. వ్యాపారాల్లో పెరిగిన పోటీని తట్టుకుంటారు.
 
మకరం: దంపతుల మధ్య అవగాహన కుదరదు. మీ మేలు పొందిన వారే మీపై అభాండాలు వేసేందుకు యత్నిస్తారు. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు.
 
కుంభం: మీ శ్రీమతి సూటిపోటీ మాటలు అసహనం కలిగిస్తాయి. బంధువుల మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. ఊహించని రీతిలో ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆకస్మికంగా సన్నిహితులతో మార్పులు కానవస్తాయి.
 
మీనం: బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. కార్యసాధనలో ఆటంకాలు తొలగి వ్యవహారాలు సానుకూలమవుతాయి. అపార్థాలు మాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఉద్యోగాభివృద్ధికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.