సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (06:19 IST)

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 18-10-17

మేషం: వస్త్ర, ఫ్యాన్సీ, చిరు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. చిన్న తప్పిదమే పెద్ద సమస్య అయ్యే ఆస్కారం వుంది. మీ కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. కిర

మేషం: వస్త్ర, ఫ్యాన్సీ, చిరు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. చిన్న తప్పిదమే పెద్ద సమస్య అయ్యే ఆస్కారం వుంది. మీ కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
వృషభం: కుటుంబ అవసరాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు, వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. చేతివృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా లభించిన ప్రతిఫలం సంతృప్తికరంగా ఉంటుంది. 
 
మిథునం: ఆశాభావంతో ఉద్యోగయత్నం సాగించండి. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిమ్ములను చూసి అసూయపడే వారు అధికమవుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.
 
కర్కాటకం: దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మొక్కుబడులు, రుణాలు తీర్చుకుంటారు. మిత్రులను కలుసుకుంటారు. జరిగిన తప్పిదానికి చింతించకండి. వ్యాపారస్తులు చక్కని మాటతీరు, లాభదాయక స్కీమ్‌లతో కొనుగోలుదార్లు ఆకట్టుకుంటారు. షాపు గుమాస్తాలు, పనివారలకు ఆదాయాభివృద్ధి.
 
సింహం: ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, అదనపు బాధ్యతలతో తీరిక ఉండదు. దైవదర్శనాల్లో అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులు, పొదుపు పథకాల దిశగా ఆలోచిస్తారు. స్త్రీలకు టీవీ ఛానెళ్ల కార్యక్రమంలో అవకాశం లభిస్తుంది. మిత్రులు పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి.
 
కన్య: స్త్రీల ఏమరుపాటు వల్ల ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం మంచిది. కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు. సమస్యలు, ఇబ్బందులు  తాత్కాలికమేనని గమనించండి. స్వార్థపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువ అవ్వాలని భావిస్తున్న వారిని దూరంగా ఉంచండి.
 
తుల: సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. స్త్రీలలో ఒత్తిడి, హడావుడి చోటుచేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరం. గత అనుభవంతో ఒక సమస్యను అధికమిస్తారు. మీ గౌరవ ప్రతిష్టలు భంగం కలుగకుండా జాగ్రత్తగా వ్యవహరించండి.
 
వృశ్చికం: ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి ఉండదు. వ్యాపారాల్లో అమలు చేసిన స్కీములు మెరుగైన ఫలితాలిస్తాయి. రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
ధనస్సు: కుటుంబీకుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం గమనించండి. బంధువుల రాక వల్ల తలపెట్టిన పనిలో ఒత్తిడి, ఆటంకాలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాల్లో మెళకువ చాలా అవసరం. 
 
మకరం: ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలపై శకునాలు, ఎదుటివారి మాటలు తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్న తప్పిదమైనా సునిశితంగా ఆలోచించడం క్షేమదాయకం.
 
కుంభం: ఆర్థికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించడం మంచిదికాదు. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు అలంకారాలు, విలాసవస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. దాంపత్యసుఖం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి. 
 
మీనం: హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాత వస్తువులను కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానం ఫలిస్తుంది. ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో మెలకువ అవసరం. మార్కెటింగ్ రంగాల వారికి పెద్ద సంస్థల నుంచి అవకాశాలు లభిస్తాయి.