శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2017 (06:09 IST)

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 17-10-17

మేషం : చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. స్త్రీలు వేడుకలు, శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఆత్మీయుల ద్వారా ఒక ముఖ్య సమాచారం అందుకుంటార

మేషం : చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. స్త్రీలు వేడుకలు, శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఆత్మీయుల ద్వారా ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. పత్రిక, ప్రైవేట్ సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. 
 
వృషభం : నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆకస్మిక ఖర్చులు, వాయిదా చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. ప్రియతముల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది. అదనపు సంపాదన కోసం బాగా శ్రమిస్తారు. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి మొండి బకాయిలు వసూలు కాగలవు. 
 
మిథునం : ముఖ్యమైన పత్రాలు, రసీదులు అందుకుంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు క్రమేణా నివారణ అవుతాయి. సన్నిహితుల ప్రోద్భలంతో దైవదీక్షలు స్వీకరిస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి.
 
కర్కాటకం : ఆత్మీయులతో విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు ధనప్రాప్తి, వస్తు, వస్త్రలాభం వంటి శుభ ఫలితాలున్నాయి.
 
సింహం : కొత్త సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
 
కన్య : ఒక శుభకార్యానికి హాజరుకాకపోవడం వల్ల నిష్టూరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిత్రులకిచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి.
 
తుల : స్త్రీలపై చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. మెడికల్ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులు, ఉన్నతాధికారులు కొత్త వ్యక్తులను దూరంగా ఉంచడం శ్రేయస్కరం. 
 
వృశ్చికం : ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కొన్ని వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. 
 
ధనస్సు : సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ హోదా చాటుకోవడానికి ధనం బాగా వ్యయం చేయాల్సి వస్తుంది. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో సోదరీ సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి ముమ్మరంగా యత్నాలు సాగిస్తారు. 
 
మకరం : ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచనస్ఫురిస్తుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థలలోని వారికి పనిభారం అధికం. మీ కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం.
 
కుంభం : వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో ముఖ్యమైన వ్యవహారాలు సంప్రదింపులు జరుపుతారు. ప్రతివిషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. మీ జీవితభాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందుతారు. స్థిరచరాస్తులు, షేర్ల క్రయ విక్రయాల్లో పునరాలోచన మంచిది.
 
మీనం : ఆహార, వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఒక స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన వాయిదా వేయడం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలు ప్లీడర్లకు చికాకు కలిగిస్తాయి.