సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2017 (06:52 IST)

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 19-10-17

మేషం: ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టి పనులు ఒక పట్టాన పూర్తికావు. భాగస్వామిక వ్యాపారాల్లో ఆధిపత్యానికి భంగం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాబడికి మించిన ఖర్చుల వల్ల ఒకింత ఇబ్బందులు ఎదుర్కోవలసి

మేషం: ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టి పనులు ఒక పట్టాన పూర్తికావు. భాగస్వామిక వ్యాపారాల్లో ఆధిపత్యానికి భంగం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాబడికి మించిన ఖర్చుల వల్ల ఒకింత ఇబ్బందులు ఎదుర్కోవలసి వుంటుంది. ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవడం క్షేమదాయకం.
 
వృషభం: సన్నిహితుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ఊహించని ప్రయాణాలు సంభవం. ఆలయాలను సందర్శిస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది.
 
మిథునం: మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.
 
కర్కాటకం: స్నేహితులు, బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పెద్దల సలహాలను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు.
 
సింహం: ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత తప్పదు. స్త్రీలు తాము అనుకున్నది సాధించగలుగుతారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. భార్యాభార్తల మధ్య మనస్పర్ధలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
కన్య: స్త్రీలకు షాపింగ్‌ల్లో నాణ్యతను గమనించాలి. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత మెలకువ అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో సహచరుల మద్దతు లభిస్తుంది. కంపెనీల ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలు ఫలిస్తాయి. ప్రైవేట్ సంస్థల్లో వారు ఓర్పు, అంకిత భావంతో పనిచేయాల్సి వుంటుంది.
 
తుల: కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవచ్చును. చిన్ననాటి వ్యక్తుల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేస్తారు.
 
వృశ్చికం: ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది. పాత వస్తువు లను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. ఒక ప్రకటన మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
 
ధనస్సు: చేపట్టిన వ్యాపారంలో నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. పెద్దల మాటను శిరసా వహిస్తారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
మకరం: విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింతగా కృషి చేయవలసి వుంటుంది. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా వుండగలదు. ఆప్తులతో నిజాయితీగా మెలగండి.
 
కుంభం: సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాల్లో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కొంటారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు.
 
మీనం: దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేతి వృత్తి, వ్యాపారులకు సదవకాశాలు లభిస్తాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. విద్యా, వైజ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి పెరుగును. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.