శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (18:04 IST)

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 28-09-2017

మేషం: వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, పరిస్థితులు అనుకూలతలు ఉంటాయి. పోగొట్టుకున్న వస్తువులు, పత్రాలు తిరిగి పొందుతారు. పనులు, కార్యక్రమాలు హడావుడిగా స

మేషం: వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, పరిస్థితులు అనుకూలతలు ఉంటాయి. పోగొట్టుకున్న వస్తువులు, పత్రాలు తిరిగి పొందుతారు. పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. హామీలు, అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
 
వృషభం: ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముక్కుసాటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యాపారాల్లో ఒకదానిలో వచ్చిన నష్టాన్ని మరొక విధంగా పూడ్చుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధి పొందుతారు. 
 
మిథునం : బ్యాంకు పనులు పూర్తి చేస్తారు. ధనం ఎంత వస్తున్నా నిల్వచేయలేకపోతారు. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. లౌక్యంగా పనులు, వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కర్కాటకం: దేవాలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు మరి కొంతకాలం వాయిదా వేయడం మంచిది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ కోరికలు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు.
 
సింహం: ఉపాధ్యాయులు సన్మానాలు అందుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. ప్రేమికులకు మధ్య అవగాహనా లోపం వల్ల ఊహించని పరిణామాలు సంభవిస్తాయి. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు.
 
కన్య: ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సఖ్యత లోపిస్తుంది. విద్యుత్, రవాణా రంగాల్లోని వారికి చికాకులు అధికం.
 
తుల: వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోటులు తప్పవు. స్త్రీలు విలువైన వస్తువులు, బంగారం సమకూర్చుకుంటారు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రిప్రజెంటివ్‌లకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. ఇతరుల వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం.
 
వృశ్చికం: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడక స్వయం కృషిపైనే ఆధారపడటం మంచిది. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు వాయిదా పడతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
ధనస్సు: సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వారసత్వపు వ్యవహారాల్లో చికాకులు తప్పవు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవాల్సి వస్తుంది. ప్రయాణాల్లో తొందరపాటు తనం అంత మంచిది కాదని గమనించండి. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు వుంటాయి. 
 
మకరం: కొంతమంది మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. స్త్రీలకు శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. దంపతులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో  అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. 
 
కుంభం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు  చికాకు కలిగిస్తుంది.
 
మీనం : భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లకు నిరుత్సాహం తప్పదు. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను సునాయాసంగా పూర్తి చేస్తారు. ఉద్యోగరీత్యా ఆకస్మిక ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో చిన్న చిన్న చికాకులు తలెత్తుతాయి. బ్యాంకు పనులు విసుగు కలిగిస్తాయి.