సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (06:10 IST)

శుభోదయం.. ఈ రోజు రాశిఫలితాలు 27-09-2017

మేషం : నూతన పెట్టుబడులు, వివాహాది యత్నాలకు అనుకూలం. కొత్తవారితో సంబంధ బాంధవ్యాలు విస్తరిస్తాయి. చేపట్టిన పనులు సంపూర్ణంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు నూతన వాతావరణం, పరిచయాలు సంతృప్తినిస్తాయి. మీ బా

మేషం : నూతన పెట్టుబడులు, వివాహాది యత్నాలకు అనుకూలం. కొత్తవారితో సంబంధ బాంధవ్యాలు విస్తరిస్తాయి. చేపట్టిన పనులు సంపూర్ణంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు నూతన వాతావరణం, పరిచయాలు సంతృప్తినిస్తాయి. మీ బాధ్యతలు, పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందులెదుర్కొంటారు.
 
వృషభం : స్థిర చరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ భావాలు, అభిప్రాయాలను ఎదుటివారు అర్థం చేసుకుంటారు. స్త్రీలకు ఆకస్మిక ధన, వస్తు, వస్త్ర ప్రాప్తి వంటి శుభ సూచనలున్నాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
మిథునం : గణిత, సైన్సు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ వృత్తుల్లో వారికి కలిసి వచ్చే కాలం. కొన్ని సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. పెద్దలతో ఆస్థి వ్యవహారాలు సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలకు నూతన వాతావరణం, పరిచయాలు సంతృప్తినిస్తాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. చిన్నారులతో బంధం ఏర్పడుతుంది.
 
కర్కాటకం : గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. మిత్రులు ద్వారా అందిన ఒక సమాచారం మీకు ఆందోళన కలిగిస్తుంది. రుణాలు, చేబదుళ్లకు యత్నాలు సాగిస్తారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. వస్త్ర, బంగారు, వెండి, వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి.
 
సింహం : చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.
 
కన్య : ఆర్థిక లావాదేవీలు, నూతన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. ఆత్మీయుల కలయిక వల్ల మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు ఆరోగ్యము అంతంతమాత్రంగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి.
 
తుల : ముఖ్యమైన వ్యవహారాలు ఇతరుల జోక్యం వలన వాయిదా పడతాయి. దీక్ష వహిస్తారు. రాజకీయాలలోని వారికి రహస్యపు విరోధులు అధికం అవుతున్నారని గమనించండి. భాగస్వామిక వ్యాపారస్తులకు పరస్పర అవగాహన కుదరకపోవచ్చు. షేర్ వ్యాపారస్తులకు సంతృప్తి కానరాగలదు. భక్తి శ్రద్ధలు పెరుగుతాయి.
 
వృశ్చికం : సిమెంట్, ఐరన్, కలప రంగాలలో వారికి వారి రంగాలలో చురుకుదనం కనిపిస్తుంది. నివాస గృహంలో సమస్యలు తలెత్తుతాయి. లారీ వ్యాపారస్తులకు చికాకులు తప్పవు. బంధువులు కొంతమంది మీ మీద నిందారోపణ చేయడం వల్ల ఆందోళన అధికమవుతుంది. ఉపాధ్యాయ రంగాలవారికి సంతృప్తి.
 
ధనస్సు : పాత వస్తువులు కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలించగలవు. ఉన్నతస్థాయి వ్యక్తుల సహాయసహకారాలు లభిస్తాయి. పూర్వపు మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. మీ ఆలోచనలను క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు.
 
మకరం : ఆర్థిక విషయాలలో సమస్యలు తలెత్తినా ముఖ్యులు సహకారం వలన పరిష్కరించబడతాయి. పండ్లు, పూలు, కూరగాయలు వ్యాపారస్తులకు అనుకూలం. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయంలో ఆచితూచి వ్యవహరించండి.
 
కుంభం : స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించకపోడంతో కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ట్రాన్స్ పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలవారికి సామాన్యం. సన్నిహితులతో కలిసి వనసమారాధన, సమావేశాల్లో పాల్గొంటారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. షాపింగ్ చేయగలుగుతారు.
 
మీనం : ముఖ్యమైన పనులు ఆశించిన రీతిలో పూర్తి చేస్తారు. ఎల్ఐసీ, బ్యాంకింగ్, ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న మొక్కుబడులు తీర్చుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. క్రీడా రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.