గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (05:52 IST)

శుభోదయం : ఈరోజు రాశిఫలితాలు 23-09-2017

మేషం: ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు వుంటాయి. పెద్దల ఆరోగ్యంలో చిన్న చిన్న చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు, ధనప్రలోభాలకు దూరంగా వుండాలి. వృత్తుల వారికి స్వల్ప చికాకులు మినహా సమస్యలుండవు. బ్యాంకుల్ల

మేషం: ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు వుంటాయి. పెద్దల ఆరోగ్యంలో చిన్న చిన్న చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు, ధనప్రలోభాలకు దూరంగా వుండాలి. వృత్తుల వారికి స్వల్ప చికాకులు మినహా సమస్యలుండవు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
వృషభం : కుటుంబంలో ఉల్లాసకరమైన వాతావరణం నెలకొంటుంది. అధైర్యపడకండి. ధైర్యంగా ముందుకు వెళ్లండి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రణాళికా బద్ధంగా వ్యయం చేయవలసిన సమయం. ఆస్తి వ్యవహరాలలో ప్రయోజనాలు కానవస్తాయి.
 
మిథునం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. మీ సన్నిహితుల వైఖరి వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. నూనె, మిర్చి, కంది స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు ఆశాజనకం. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. 
 
కర్కాటకం: హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. దైనందిన కార్యక్రమాల్లో మార్పుండదు. ప్రైవేట్, పబ్లిక్ సంస్థల్లో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రోజంతా ఆహ్లాదకరంగా గడిచిపోతుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. 
 
సింహం: చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడగలవు. స్థిరాస్తుల అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడటం మంచిది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల చికాకులు అధికం. 
 
కన్య: ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధికమిస్తారు. ఉద్యోగులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. గత తప్పిదాలు పునరావృతం కానున్నాయి. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. పెద్దలు, మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
తుల: భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకారం అందిస్తారు. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో మెలకువ అవసరం. 
 
వృశ్చికం : ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫలితాలు పొందుతారు. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. స్త్రీల సరదాలు, మనోవాంఛలు నెరవేరుతాయి.
 
ధనస్సు : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించకపోవడంతో కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి.
 
మకరం: దైవ, సేవా, పుణ్య కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. కీలకమైన వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. మొండి బాకీలు వసూలులో శ్రమాధిక్యత, ప్రయోసలెదుర్కుంటారు.
 
కుంభం: పుణ్యక్షేత్రాల దర్శనాలు అనుకూలిస్తాయి. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిదికాదు. నిరుద్యోగులకు చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుంటారు.
 
మీనం: మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమవుతుంది. ముఖ్యమైన విషయాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. రావలసిన బకాయిలు సకాలంలో అందుతాయి. మీ ఆశయసిద్ధికి నిరంతర కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి.