1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Your Rashi Phalalu on August 1st 2018

ఆగస్టు 01-08-2018 మీ రాశి ఫలితాలు ఇలా వున్నాయి

మేషం: ఉపాధ్యాయుల తొందరపాటు తనం వలన సమస్యలు తలెత్తుతాయి. వ్యవసాయ రంగాలలోవారికి మెళకువ అవసరం. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదని గమనించండి. రాజకీయాలలోని వారికి పార్టీ పరంగాను, అన్ని విధాలా కలసివస్

Rashi Phalalu
మేషం: ఉపాధ్యాయుల తొందరపాటు తనం వలన సమస్యలు తలెత్తుతాయి. వ్యవసాయ రంగాలలోవారికి మెళకువ అవసరం. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదని గమనించండి. రాజకీయాలలోని వారికి పార్టీ పరంగాను, అన్ని విధాలా కలసివస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
వృషభం: వస్త్ర, ఫోము, లెదర్, పీచు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. సోదరీసోదరులతో ఏకీభవించలేరు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్నేహ సంబంధ బాంధవ్యాలు విస్తరిస్తాయి. రచయితలకు గుర్తింపు రాణింపు లభిస్తుంది.
 
మిధునం: నూనె, ఎండుమిర్చి, పసుపు, ధనియాలు, బెల్లం, శెనగలు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన మంచిది. సమయాన్ని వృదా చేసే కొలది నష్టాలను ఎదుర్కుంటారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.  
 
కర్కాటకం: స్త్రీలకు ఉదరం, మోకాళ్ళు,  నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలోని వారికి పనిలో ఒత్తిడి అధికమవుతుంది. మీ సంతానం కోసం ధనం బాగా ఖర్చుచేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. మిమ్మల్ని హేళన చేసే వారు మీ సహాయాన్ని అర్ధిస్తారు. 
 
సింహం: పారిశ్రామిక రంగాలవారికి ప్రోత్సాహం లభిస్తుంది. మీ ప్రగతికి కుటుంబ సభ్యులు సహకరిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. క్లిష్టతరమైన పనుల్ని ఎలా అధిగమించాలో తెలియనప్పుడు తగిన సూచనలు పాటించండి. ఐరన్, సిమెంట్, కలప రంగాలలోని వారికి చికాకులు తలెత్తుతాయి.
 
కన్య: బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిన పెట్టుబడులు అనుకూలం. గృహోపకరణాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. దైవదర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రేమికులకు పెద్దల నుండి ప్రోత్సాహం, సన్నిహితుల సహకారం ఉంటాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.  
 
తుల: ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. వస్త్ర, బంగారు విలువైన వస్తువులను అమర్చుకుంటారు. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
వృశ్చికం: తలపెట్టిన పనిలో సంతృప్తి, చయం చేకూరగలదు. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సత్‌కాలం. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడడం మంచిది. పాత మిత్రుల కలయికతో కొత్త అనుభూతి పొందుతారు. 
 
ధనస్సు: పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. కుటుంబీకుల నుండి విమర్శలను ఎదుర్కుంటారు. ప్రభుత్వ, పై అధికారుల సహాయ సహకారాలు లభించగలవు. తలపెట్టిన పనులు అనుకూలిస్తాయి. స్త్రీలపై సన్నిహితులు, చుట్టుప్రక్కల వారా ప్రభావం అధికంగా ఉంటుంది. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. 
 
మకరం: కాంట్రాక్టర్లకు అధికారుల నుండి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. ప్రింటింగ్ రంగాలవారికి మందకొడిగా ఉంటుంది. కోల్పోయిన వస్తువులు, పత్రాలు చేజిక్కించుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కుంభం: నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వాధికారుల నుండి వేధింపులు తప్పవు. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒత్తిడి అధికం. మనోధైర్యంతో యత్నాలు సాగించాల్సి ఉంటుంది. 
 
మీనం: కోర్టు వ్యవహారాలలో పీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఆసక్మికంగా దూరప్రయాణాలు చేస్తారు. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత మినహా ఫలితం ఏమాత్రం ఉండదు. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు క్రమేణా అధికమిస్తారు.
About Writer
Raman
తర్వాతి కథనం
కలలో పువ్వుల తోట కనిపిస్తే... ఏ జరుగుతుందో తెలుసా?