సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 16 జూన్ 2018 (17:44 IST)

జూన్ 17 నుంచి 23 జూన్ 2018 వరకు మీ వార రాశి ఫలితాలు(Video)

మిధునంలో రవి, బుధుడు, కర్కాటకంలో శుక్ర రాహువులు, తులలో వక్రి బృహస్పతి, వక్రి శని, మకరంలో కుజ, కేతువులు, కర్కాటక, సింహ, కన్య, తులలో చంద్రుడు. ముఖ్యమైన పనులకు సప్తమి, బుధవారం శుభదాయకం.

మిధునంలో రవి, బుధుడు, కర్కాటకంలో శుక్ర రాహువులు, తులలో వక్రి బృహస్పతి, వక్రి శని, మకరంలో కుజ, కేతువులు, కర్కాటక, సింహ, కన్య, తులలో చంద్రుడు. ముఖ్యమైన పనులకు సప్తమి, బుధవారం శుభదాయకం. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యహారానుకూలత ఉంది. మనోధైర్యంతో ముందుకు సాగండి. సమర్ధతను చాటుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. మీ జోక్యం అనివార్యం. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. యత్నాలను కొనసాగించండి. గురు, శుక్రవారాల్లో ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. ఆత్మీయుల సాయం అందుతుంది. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వేడుకల్లో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులెదుర్కుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఆర్థికంగా కుదుటపడుతారు. కొంత మెుత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తిచేస్తారు. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శనివారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం సంతృప్తికరం. నూతన వ్యాపారులకు అనుకూలం. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. విందుల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. ప్రయాణం తలపెడతారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. ఒత్తిళ్లకు లొంగవద్దు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలను విరమించుకోవద్దు. పనులు సాగక విసుగు చెందుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. నోటీసులు, ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. వాహన చోదకులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభకార్యంలో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపుచేయండి. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఖర్చులు సంతృప్తికరం. వస్తువుల కొనుగోలులో నాణ్యతను గమనించండి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. కంప్యూటర్ రంగాలవారికి ఒత్తిడి అధికం. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఖర్చులు విపరీతం. ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. అవకాశాలు చేజారినా మంచిదే. త్వరలో శుభవార్త వింటారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. వేడుకలకు హాజరవుతారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పెద్దమెుత్తం సాయం తగదు. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. ఆది, సోమ వారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరువ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. బంధుత్వాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. సంప్రదింపులు అనుకూలం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. మంగళ, బుధ వారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు ఫర్వాలేదనిపిస్తాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఎదుటివారి గురించి ఉన్నతంగా ఆలోచిస్తారు. వారే మీ మంచితనాన్ని అర్థం చేసుకోరు. కొన్ని విషయాలు పట్టించుకోద్దు. గృహ మరమ్మత్తులు చేపడతారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరం. అనవసర జోక్యం తగదు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. గురు, శుక్ర వారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. వివాదాలు సద్దుమణుగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ
మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సహాయం ఆశించవద్దు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. పొదుపు మూలక ధనం గ్రహిస్తారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యతలోపం. ఆత్మీయుల రాక ఊరట కలిగిస్తుంది. సంతానం గురించి ఆందోళన చెందుతారు. ప్రముఖుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. నిరుద్యోగులకు ముఖ్య సమచారం అందుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు ఫలించకపోవచ్చు. మీ నిర్ణయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. మెుహమ్మాటాలు, ఒత్తిళ్లకు తలొంగ్గవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆత్మీయుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. విద్యా ప్రకటనలు, బోగస్ సంస్థలను విశ్వసించవద్దు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. సంస్థల స్థాపనలకు వనరులు సర్దుబాటవుతాయి. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వివాహ యత్నాలను తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థికలావాదేవిలతో హడావుడిగా ఉంటారు. ఫైనాన్స్ సంస్థలతో ఇబ్బందులు తలెత్తుతాయి. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తగదు. సన్నిహితుల సలహా పాటించండి. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. ఖర్చులు సంతృప్తికరం. అవసరాలు నెరవేరుతాయి. ఏజెన్సీలు, కాంట్రాక్టులు లాభిస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. జూదాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త రుణాలు మంజూరవుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్తు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించండి. పత్రాలు, నగదు జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. సన్నిహితుల కలయికతో కుదుటపడుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. విమర్శలను దీటుగా స్పందిస్తారు. ఆది, సోమ వారాల్లో కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పరిస్థితులు క్రమంగా సర్దుకుంటాయి. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. సకాలంలో చెల్లింపులు ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. త్వరలో శుభవార్త వింటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయంచేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి. గృహంలో మార్పులు చేపడతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. మంగళ, శని వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. నమ్మిన వారే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ధనలాభం ఉంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ప్రశంసలు అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వీడియో చూడండి...