1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
  4. If you chant this Lord Vishnu sloka every morning

ప్రతిరోజూ ఉదయాన్నే ఈ శ్లోకం జపిస్తే

Lord Vishnu
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితం చాలా వేగవంతం అయిపోయింది. నిత్యం తీరిక లేని పనులతో నిండిపోతుంది. ఐతే ప్రతిరోజూ ఉదయాన్నే దైవాన్ని ప్రార్థిస్తుంటే రోజంతా హాయిగా గడిచిపోతుంది. ఆ భగవంతుని శ్లోకాన్ని జపిద్దాం.
 
శాంతాకారం భుజగశయనం
పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం
మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం
యోగి హృద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం
సర్వ లోకైకనాథం
 
ఈ శ్లోకానికి అర్థం
శాంతమైన ఆకారం కలవాడు, శేషనాగుపై శయనించి ఉన్నవాడు, నాభియందు పద్మం కలవాడు, దేవతలకు అధిపతి, విశ్వానికి ఆధారం అయినవాడు, ఆకాశంతో సమానమైనవాడు, మేఘ వర్ణం వంటి మేని ఛాయ కలిగినవాడు, శుభప్రదమైన శరీరం కలవాడు, లక్ష్మీదేవికి భర్త అయినవాడు, పద్మం వంటి నేత్రాలు కలవాడు, యోగుల హృదయాలలో ధ్యానము ద్వారా పొందబడేవాడు, సంసార భయాన్ని పోగొట్టేవాడు, సర్వలోకాలకు ఏకైక ప్రభువు అయిన ఆ శ్రీ మహావిష్ణువుకు నేను నమస్కరిస్తున్నాను.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
27-09-2026 నుంచి 03-10-2026 వరకు రాశి ఫలితాలు- అన్నింటా మీదే పైచేయి