1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
  4. The Psychology of Introverted Employees

ఓడిపోతామనే భయంతో ప్రయత్నం చేయకపోతే ఎలా?

The Psychology of Introverted Employees
కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు లేదా విధుల్లో చేరి ఎన్నాళ్లయినా సరే.. ఎప్పుడూ విద్యార్థిలాగానే ఉండాలి. ఏ రోజుకా రోజు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వర్తమాన వ్యవహారాలను గమనిస్తూ, భవిష్యత్తుకి అనుగుణంగా ఆలోచనలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకున్నామనే సంతృప్తి, వాటిని అమలుపరచాలనే ఉత్సాహం కలుగుతాయి దీంతో విసుగు, విరామం దరిచేరవు. మీ ఆలోచనా విధానం పాతబడుతుందన్న ప్రసక్తే ఉండదు. 
 
ఓడిపోతాం అన్న భయంతో ప్రయత్నమే చేయకపోవడం సరికాదు. అందరూ ఏదో ఒక సందర్భంలో పొరపాట్లు చేసే వారే. కానీ పనితీరును అప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పొరపాట్లను దిద్దుకోవడంలోనే విజయం ఉంది. మీరు చేస్తున్న పనిలో మీ సహోద్యోగుల సూచనలను అవకాశం ఇవ్వండి. మీ పనుల్లో ఎవరైనా పొరపాట్లను ఎత్తి చూపినప్పుడు వాటిని సానుకూలంగా స్వీకరించండని మానసిక నిపుణులు అంటున్నారు. 
About Writer
Selvi