1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Radhika Sarathkumar SLAMS influencers and YouTubers

నెగెటివ్ రివ్యూలు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : సినీ నటి రాధిక

radhika sarathkumar
ఒక సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్ ప్రచారం చేసే వారిపై యూట్యూబర్స్, కంటెంట్ క్రియేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కోరారు. ఇందుకోసం ఒక బలమైన వ్యవస్థ ఉండాలని ఆమె సూచించారు. ఇటీవల నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, సినిమా బాగున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ప్రతికూల ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 
అదుపుతప్పుతున్న ఇలాంటి కంటెంట్ క్రియేటర్లను నియంత్రించేందుకు ఒక బలమైన వ్యవస్థ ఉండాలని, హద్దులు దాటి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా, డిజిటల్ విస్తృతి పెరిగాక నటీనటులతో పాటు వారి కుటుంబ సభ్యులపైనా కూడా ఇష్టానుసారంగా విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. 
 
తమను ఎవరూ ప్రశ్నించరనే ధీమాతో కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం సినిమా రివ్యూల వ్యవహారం అదుపు తప్పుతోందని, ఇది ప్రపంచ వ్యాప్త సమస్య అయినప్పటికీ మన దగ్గర మరింత తీవ్రంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ధర్మన్ లీక్స్: రామ్ పోతినేని, రాశీ ఖన్నా తర్వాత శ్రీలీల