1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Dhanraj Wife Supported When He Had No Money For Mothers Funeral Tragedy In Life

కన్నతల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేదు.. అపుడు ఆమె ఆదుకుంది : ధన్‌రాజ్

dhanraj
తన తల్లి కేన్సర్ వ్యాధి సోకి మరణించిందని, ఆసమయంలో అంత్యక్రియలు చేసేందుకు తన చేతిలో చిల్లిగవ్వ లేదని, ఆ సమయంలో తన భార్య ఆదుకున్నారని ప్రముఖ హాస్య నటుడు ధన్‌రాజ్ తాజాగా వెల్లడించారు. ఆయన తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న తీవ్రమైన కష్టాలు, ఆ సమయంలో ఆయన భార్య శిరీష్ అందించిన అండదండల గురించి వెల్లడించిన అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
విజయవాడకు చెందిన ధన్‌రాజ్, ఖమ్మం ప్రాంతానికి చెందిన శాస్త్రీయ నృత్య కళాకారిణి శిరీషల పరిచయం హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. ఫిల్మ్ నగరులో ధన్‌రాజ్ ఒక డ్యాన్స్ స్టూడియో ఏర్పాటు చేసి, శిక్షకురాలి కోసం చూస్తున్న క్రమంలో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. అయితే, వీరిద్దరూపరిచయమైన రోజే ధన్‌రాజ్ తల్లి కేన్సర్‌తో తుదిశ్వాస విడిచారు. తీవ్ర విషాదంలో ఉన్న ధన్‌రాజ్... తల్లిని కోల్పోయిన రోజే శిరీష రూపంలో తనకు మరో ఆధారం దొరికిందని భావించారు.
 
ఆ సమయంలో ధన్‌రాజ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం తల్లి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఆయన వద్ద తగినంత సొమ్ము లేదు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో శిరీష తన దగ్గరున్న బంగారాన్ని మొత్తం ధన్‌రాజ్‌కు ఇచ్చి ఆదుకున్నారు. అనంతరం ఇరు కుటుంబాల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ, శిరీష ముందడుగు వేసి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమేనట. ఈ విషయాలన్నీ శిరీష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
 
వీరి వివాహం జరిగిన మూడో రోజే ధన్‌రాజ్ నటించిన 'జగడం' సినిమా విడుదలైంది. ఆ చిత్రంతో ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు దక్కడంతో పాటు వరుస అవకాశాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 'పరుగు', 'యువత', 'పిల్ల జమీందార్', 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది', 'గోపాల గోపాల' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో సహా 80కి పైగా సినిమాల్లో నటించి ధన్‌రాజ్ తెలుగు చిత్రపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెల్సిందే. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Aakashamlo Oka Tara Review: స్పూర్తి కలిగించేదిగా ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ