గురువారం, 25 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2017 (17:43 IST)

ప్రతి శనివారం శనిదేవుడికి అలా చేస్తే...

జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక్కో సమయంలో ఏదీ జరగదు. ఏది ముట్టుకున్నా ఆగిపోతుంది. అసలుకే నష్టం వస్తుంది. ఏదైనా వ్యాపారం చేద్దామన్నా.. పని మొదలుపెడదామన్నా ఏదీ జరుగదు. మన సమయం బాగా లేదేమో అనిపిస్తుంది. ఇలా ఉ

జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక్కో సమయంలో ఏదీ జరగదు. ఏది ముట్టుకున్నా ఆగిపోతుంది. అసలుకే నష్టం వస్తుంది. ఏదైనా వ్యాపారం చేద్దామన్నా.. పని మొదలుపెడదామన్నా ఏదీ జరుగదు. మన సమయం బాగా లేదేమో అనిపిస్తుంది. ఇలా ఉద్యోగాలు చేసేవారికి మాత్రమే కాదు విద్యార్థులకు, వృద్ధులకు, గృహిణులకు కూడా ఇలాంటి అనుభవం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో కొంతమంది ధైర్యంగా ఉంటారు. మంచి సమయం కోసం ఎదురుచూస్తుంటారు. అయితే మరికొంతమంది మాత్రం ఆ చెడు సమయాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయాన్ని ఎదుర్కోవడానికి ధృఢంగా ఉండాలి.
 
శాస్త్రాల ప్రకారం ఇలా చేస్తే ఎదుర్కొనే సమస్య నుంచి దూరం కావచ్చనే విశ్వాసం వుంది. శనివారం ఒక్కరోజు చేస్తే చాలు. సమస్యలు తీరిపోతాయ్. ప్రతిరోజు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదవాలి. ప్రతిరోజు వీలు పడకపోతే వారంలో వీలైనంతగా చదవాలి. ప్రతి శనివారం శనిదేవుడికి తైలం అర్పించాలి. తైలం అర్పించడం వల్ల శనిదేవుడు ప్రసన్నమైపోతాడు. మీరు కోరిన కోర్కెలు తీరేలా వరమిస్తాడు.