మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2017 (17:32 IST)

శనికి ''శనీశ్వరుడు'' అనే పేరు ఎలా వచ్చింది.. శనివారం ఇలా చేస్తే?

కృతయుగంలో కైలాసానికి పరమేశ్వరుడి దర్శనార్థం వచ్చిన నారదుడు నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహ బలాన్ని గురించి చెప్పుకొచ్చాడు. నారదుడు అలా శనిదేవుడిని ప్రశంసించడం పరమేశ్వరుని ఏమాత్రం నచ్చలేదు. అంతేకాకుండా శనిదే

శనివారం పూట శనీశ్వరుడిని పూజిస్తే ఏలినాటి, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి. శనీశ్వరుడు సూర్యుడికి, అతని భార్య ఛాయాదేవికి జన్మించిన సంతానం. ఆయనకు ఛాయాపుత్రుడనే పేరు కూడా వుంది. అలాంటి శనిదేవుడు ఈశ్వరుని పేరుతో అంటే శనీశ్వరుడు అని ఎందుకు పిలవబడుతున్నాడని తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. 
 
కృతయుగంలో కైలాసానికి పరమేశ్వరుడి దర్శనార్థం వచ్చిన నారదుడు నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహ బలాన్ని గురించి చెప్పుకొచ్చాడు. నారదుడు అలా శనిదేవుడిని ప్రశంసించడం పరమేశ్వరుని ఏమాత్రం నచ్చలేదు. అంతేకాకుండా శనిదేవుడు శక్తివంతుడైతే తన ప్రభావాన్ని తనపై చూపించి.. తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాల్సిందిగా చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న శనిగ్రహం.. శివుడిని పట్టేందుకు వెళ్తాడు. శివపరమాత్మను ఒక్క క్షణమైనా పట్టి పీడిస్తానని నారదునితో తిరుగు వర్తమానం పంపుతాడు శనిదేవుడు. 
 
శనిదేవుడు ఇచ్చిన హెచ్చరికతో శివుడిని నారదుడు జాగ్రత్తగా ఉండమంటాడు. దీంతో శని పని పట్టాలని శివుడు కైలాసం నుంచి మాయమై దండకారణ్యం బాట పట్టాడు. శని సహా ఎవరి దృష్టి కనిపించని చోటు కోసం అన్వేషించి.. అడవిలోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం ఒక పెద్ద రావిచెట్టు తొర్రలో ఈశ్వరుడు దాక్కుని తపస్సు చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
మరుసటి రోజు ఈశ్వరుడు కళ్లు తెరిచి చూసేసరికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరుడిని నమస్కరిస్తా డు. అప్పుడు ఈశ్వరుడు నీ శపథం ఏమైంది.. అని ప్రశ్నిస్తాడు. ముక్కంటి, పరమశివుడు, చరాచర జీవరాశులకు ఆరాధ్య దైవం కైలాసం నుంచి పారిపోయి, దండకారణ్యంలో పరుగులు పెట్టి దిక్కులేని వాడిలా చెట్టు తొర్రలో దాచుకోవడం శని పట్టినట్లు కాదా ఈశ్వరా? అని ప్రశ్నించాడు. దీంతో తనను పట్టిపీడించడంలో సత్తా చాటినందుకు.. తనను మెప్పించిన శనికి ఆనాటినుండి ఈశ్వర అనే శబ్దం సార్థకం కాగలదని మానవులు తనను శనీశ్వరా అని పూజిస్తే.. శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరం ఇచ్చాడు. అలా శనిగ్రహం శనీశ్వరుడు అయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. 
 
అందుకే శని అని పిలవకుండా శనీశ్వరా అని పిలవడం ద్వారా గ్రహదోషాల నుంచి విముక్తి పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇంకా శనివారం పూట శనీశ్వరునికి ప్రీతికరమైన నువ్వుల నూనె, నల్లటి నువ్వులు, నీలపు శంఖు పుష్పాలు, నల్లని వస్త్రంతో అర్చిస్తే.. వారికి మృత్యుభయం, అనారోగ్యం కలుగదు. ఈతిబాధలుండవు. సుఖశాంతులు, సకలసౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా శనివారం, శనిత్రయోదశి నాడు శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా.. ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.