తులసి అనగానే చాలామంది కేవలం మహిళలు మాత్రమే పూజించాలి అనుకుంటారు. కానీ పురుషులు కూడా ప్రతిరోజూ ఉదయాన్నే స్నానమాచరించి తులసికోట చుట్టు ప్రదక్షణ చేసినట్లయితే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతుందని చెప్పబడింది. మహిళలు శాంతి, సంతోషాలు కలగాలని కోరుకుంటూ రోజూ తులసి మొక్కకు నీళ్ళుపోస్తారు సంధ్యాసమయంలో అక్కడ దీపం వెలిగించి కుంకుమ, పుష్పాలతో తులసిని అర్చిస్తారు. తులసిదళాలు, పుష్పాలు లేనిదే శ్రీ మహావిష్ణువుకు, శ్రీకృష్ణ భగవానునికి అర్చన పరిసమాప్తి కాదని పురోహితులు...