గురువారం, 21 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By వి
Last Modified: సోమవారం, 25 మే 2020 (23:08 IST)

తులసి మెుక్కను పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తులసి మెుక్క దేవలోక పారిజాతంగా చెబుతుంటారు. అందువలనే ప్రతి ఇంటి ప్రాంగణంలో తులసి మెుక్క కనిపిస్తుంటుంది. తులసి మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణువు, చివరిలో శివుడు ఉంటారని చెబుతుంటారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తుంటారు. అందువలన తులసి ఆకులతో శ్రీమన్నారాయణుని పూజిస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడని చెప్తుంటారు.
 
 సాక్షాత్తు లక్ష్మీనారాయణులు తులసి మెుక్కలో నివాసంగా ఉంటారని విశ్వసిస్తుంటారు. అందువలన ఉదయాన్నే తులసి మెుక్కను పూజించడం వలన సకల సౌభాగ్యాలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడుతోంది. అంతేకాకుండా సాయంత్రం వేళలో తులసి కోటలో దీపం పెట్టాలి. ఈ మెుక్క పై నుండి వచ్చే గాలిని పీల్చుకోవడం వలన ఎలాంటి శ్వాస సంబంధిత వ్యాధులు దరిచేరవని అంటారు.