శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 మే 2020 (17:42 IST)

రోగనిరోధక శక్తికి దాల్చిన చెక్క, తులసి, లవంగాలుంటే చాలు

తులసి ఆకులు, పసుపు, దాల్చిన చెక్క, లవంగం వేసి బాగా వేడి చేసి ఆ నీళ్లు తాగడం ద్వారా కరోనా లాంటి వైరస్‌ను దూరంగా వుంచవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తులసి ఆకులు, పసుపు యాంటీ బ్యాక్టీరియల్‌గా బాగా పనిచేస్తాయి. లవంగాలు గొంతు నొప్పిని కలిగించే బ్యాక్టీరియాలను అంతం చేస్తాయి. ఇక దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనారోగ్య సమస్యలుండవు. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా వుంటాయి.
 
అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లంను వంటల్లో అధికంగా చేర్చుకుంటే అనారోగ్య సమస్యలుండవు. వైరస్ సంబంధిత రోగాలు తొలగిపోతాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. కాల్షియం, పొటాషియం, సల్ఫ్యూరిక్ కాంపౌండ్‌లతో పాటు వ్యాధి నిరోధక శక్తిని భారీగా పెంచడంలో వెల్లుల్లి ఉపయోగపడుతుంది. 
 
అల్లం నిండా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు... శ్వాస సమస్యలతో బాధపడేవారు... పచ్చి అల్లం రసం తాగితే మంచిదే. పోనీ ఏ టీలోనో అల్లం వేసుకొని తాగినా మంచిదేనని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.