తులసీ దళాలు ఎంతో పవిత్రమైనవంటారు? వాటిని ఏ సమయంలో కోయవచ్చు?
తులసీ దళాలు చాలా పవిత్రమైనవి. అనేక అనారోగ్య సమస్యలకు తులసి ఎంతో మేలు చేస్తుంది. తులసీ దళాలు వేసిన జలాన్ని సేవిస్తుంటే పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
తులసి దళాలను ఆదివారం, శుక్రవారం, మన్వాదులు, యుగాదులు, సంక్రాంతి, పూర్ణిమ, అమావాస్యలు, ఏకాదశి, ద్వాదశి, రాత్రులలోను, సంధ్యాకాల సమయాల్లోనూ, మధ్యాహ్నానంతర సమయంలోనూ కోయరాదని శాస్త్ర వచనం.