1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. telangana bjp president kishan reddy visits tirumala

తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

telangana bjp president kishan reddy
తిరుమల శ్రీవారిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి సేవలో ఆయన పాల్గొన్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో కిషన్‌రెడ్డికి తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 
 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పుకొచ్చారు.