బుధవారం, 29 నవంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (07:58 IST)

24వ తేదీ గురువారం 10 గంటలకు శ్రీవారి దర్శన టిక్కెట్లు రిలీజ్

venkateswara swamy
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లను నవంబరు 24వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఇవన్నీ దివ్యాంగుల కోటా టిక్కెట్లు. వీటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 
 
వయోవృద్ధులు. దివ్యాంగులు, దీర్ఘాలిక వ్యాధులతో బాధపడేవారు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తితిదే తెలిపింది. 
 
కాగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు. దివ్యాంగులు, ఐదేళ్ల లోపు చంటి బిడ్డలతో వచ్చే తల్లిదండ్రులకు తితిదే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. వీరికి ప్రతినెలా రెండు రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తుంది.