సంబంధిత వార్తలు
- జయలలిత నెచ్చెలి శశికళకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- బైడెన్ జోరు.. 50,000 మార్కును దాటి రికార్డు
- అమెరికా పార్లమెంట్ ముట్టడి: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జనవరి 21 వరకూ ఎమర్జెన్సీ
- మార్కెట్లకు ఫుల్‌జోష్.. తొలిసారి 48 వేల మార్కును దాటిన సెన్సెక్స్
- స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం... అంతర్జాతీయ స్థాయిలో సూచీల పతనం
మదుపరులకు చుక్కలు.. గరిష్టాల నుంచి వెనక్కి తగ్గిన సూచీలు
BSE
అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో గురువారం సెన్సెక్స్ తొలిసారి 50వేల మార్క్‌ను తాకింది. అదే సెషన్‌లో మదుపర్లు అమ్మకాలకు దిగడంతో తుదకు నష్టాలను మూటగట్టుకోగా.. వారాంతం సెషన్‌లోనూ అమ్మకాల పరంపర కొనసాగింది.
శుక్రవారం సెషన్‌లో ఉదయం లాభాల్లోనే మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల వైపు సాగడంతో సెన్సెక్స్ ఏకంగా 49వేల దిగువకు పడిపోయింది. దీంతో వరుసగా రెండు రోజులు నష్టపోయినట్లయ్యింది. సెన్సెక్స్ తుదకు 746 పాయింట్లు కోల్పోయి 48,878.54 కనిష్టానికి పడిపోయింది. రిలయన్స్ ఇండిస్టీస్ షేర్ 2.30 శాతం లేదా రూ.48.20 పతనమై రూ.2,049.65కు దిగజారింది.
మిడ్ క్యాప్ సూచీ 1.1 శాతం, స్మాల్ క్యాప్ 0.93 శాతం చొప్పున తగ్గాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 14,372 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఏకంగా 218 పాయింట్ల నష్టంతో 14372కు దిగజారింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో తప్పా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి.
