1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. స్వీట్లు

రవ్వ కేసరి

వంటకాలు స్వీట్లు రవ్వ కేసరి చక్కెర నెయ్యి కేసరిపొడి పచ్చకర్పూరం యాలక్కాయలు జీడిపప్పు
కావలసిన పదార్థాలు :
రవ్వ... 100 గ్రాములు
చక్కెర... 500 గ్రాములు
నెయ్యి... 200 లేదా 300 గ్రాములు
కేసరిపొడి... తగినంత
పచ్చకర్పూరం... తగినంత
ఏలక్కాయలు... 7 లేక 8
జీడిపప్పు... 7 లేక 8

తయారీ విధానం :
బాణలిలో కొంచెం నెయ్యి వేసి మొదట జీడిపప్పు, ఆ తరువాత రవ్వను వేయించి పెట్టుకోవాలి. ముప్పావు లీటరు నీటిని వేయించిన రవ్వలో కలుపుకొని బాగా ఉడికించాలి. ఉడికేటప్పుడు రవ్వని కలుపుతూ వుండాలి. వుడికిన తరువాత చక్కెర కలపాలి. చక్కెర కలిపిన వెంటనే రవ్వ తిరిగి పలుచగా తయారవుతుంది.

ఉడుకుతుండగా కలుపుతూ వుంటే అదే తిరిగి చిక్కబడుతుంది. ఆ తరువాత మిగిలిన నెయ్యి, కేసరిపొడి కలిపి ఉడికించాలి. కేసరి గిన్నెకి అంటుకోకుండా వుండేదాకా అలాకలుపుతూ వుండాలి. తరువాత స్టవ్ మీద నుండి దించి, ఏలక్కాయ పొడి, పచ్చ కర్పూరం కలిపి అతిథులకు వడ్డించండి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి