రాజ్యమా ఉలికిపడు... ప్రధాని మోడీకి కేటీఆర్ హెచ్చరిక
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ గట్టి హెచ్చరిక చేశారు. నేపాల్ దేశంలో యువత తలచుకుంటే ప్రభుత్వం గద్దె దిగిపోయిందని ఆయన గుర్తు చేశారు. రాజ్యమా ఉలికిపడు ఉంటూ గర్జించారు. మారుతున్న కాలానికి తగినట్టుగా యువత స్వరం మారుతోందని, నవతరం ఆలోచనలతో దేశ రాజకీయాల్లో మార్పు వస్తుందన్నారు. యువత తలచుకుంటే నేపాల్‌లో ప్రభుత్వం కుప్పకూలిందన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో కూడా పాలకలను యువత, ప్రజలు తరిమి కొట్టిన చరిత్ర ఉందని, అందువల్ల పాలకులైన వారు యువతను విమర్శించవద్దని ఆయన అన్నారు.
ఈడీ, సీబీఐలకు భయపడి సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను ఒక్క మీడియా సంస్థ కూడా చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ విద్యార్థులు మాకు సోషల్ మీడియా ఉందని ధైర్యంగా పోరాడుతున్నారు. కేంద్రంపై నిరసన కోసం వస్తుంటే మధ్యలో కాంగ్రెస్ వాళ్లు మమ్మల్ని అడ్డుకున్నారు. బడే భాయ్ కోసం చోటే భాయ్ అడ్డం పడుతున్నాడు. మోడీని అంటే ఈ కేడీ గాడికి ఏం అయింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి మోడీ ఇంటి ముందు కూర్చుంటే.. ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్‌లో దాక్కున్నది అని ఎద్దేవా చేశారు.
రేప్ కేసులలో బీజేపీ నాయకుల కొడుకులకు బెయిల్ వస్తుంది కానీ మాకు న్యాయం ఎందుకు జరగడంలేదని విద్యార్థులు అడుగుతున్నారు. 8 మంది బీజేపీ ఎంపీల్లో ఎవరైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారా? అని ప్రశ్నించారు. మాట్లాడితే బీజేపీ వాళ్లు దేశం కోసం ధర్మం కోసం అంటారు. దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న ఈ పిల్లలు హిందువులు కాదా? అని నిలదీశారు. అవసరమైతే మీకోసం కేసీఆర్ కూడా వస్తాడు. ఆయన సోషల్ మీడియాలో మీ ఆందోళన చూసి తల్లడిల్లిపోతున్నాడని తెలిపారు. పిల్లలే దేశ ముఖచిత్రాన్ని మారుస్తారు, వాళ్లే ఈ దేశాన్ని కాపుడుకుంటారని కరోనా సమయంలోనే కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
