సంబంధిత వార్తలు
- కలెక్టరేట్లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?
- నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి
- డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన హెడ్ కానిస్టేబుల్.. ఎక్కడ?
- మహిళా కానిస్టేబుల్‌తో పాటు ఐదుగురు మృతి.. కారణం ఏంటి?
- హైదరాబాద్: ట్రీట్ ఇవ్వమని తీసుకెళ్లి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారం
డయల్ 100కు ఫోన్ చేస్తే.. హెడ్ కానిస్టేబుల్ అలా చేశాడు.. (video)
ఓ మహిళ డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. ఓ హెడ్ కానిస్టేబుల్ అత్యాచార ప్రయత్నం చేశాడు. మెల్లగా మాటలు కలిపి ఆమెతో పరిచయం పెంచుకుని ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించి, చివరకు ఆ మహిళను బెదిరించి లైంగికదాడికి యత్నించిన ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్ వనస్థలిపురం ఠాణా పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు సాహెబ్‌నగర్ గాయత్రీనగర్ ప్రాంతం నుంచి ఇటీవల డయల్ 100కు ఓ మహిళ కాల్ చేసింది. ఈ మహిళతో కానిస్టేబుల్ పరిచయం పెంచుకున్నాడు.
ఈ పరిచయం ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల వరకూ దారితీసింది. ఈ క్రమంలో మహిళ కానిస్టేబుల్‌కు డబ్బు ఇచ్చింది. అయితే కానిస్టేబుల్ ఆ డబ్బు ఇవ్వడంలో ఇవ్వకపోవడంతో బాధితురాలు అతడిని నిలదీసింది.
దీంతో అక్టోబర్ 4వ తేదీన ఇంజాపూర్‌లో కమాన్ వద్ద తమ తల్లిదండ్రులు ఉన్నారని, వాళ్లిచ్చే డబ్బు ఆమెకు ఇస్తానని నమ్మబలికి ఆమెను కారులో ఇంజాపూర్ వైపు తీసుకెళ్లి.. ఓ నిర్జన ప్రదేశంలోకి కారును తీసికెళ్లి, అనంతరం ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.
అక్కడి నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకొని ఇంటికి చేరుకుంది. అనంతరం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో సదరు కీచక కానిస్టేబుల్‌పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు.
100కు కాల్ చేసిన మహిళపై హెడ్ కానిస్టేబుల్ అఘాయిత్యం
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2024
వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ తన ఇంటి పక్కన గొడవ జరగగా 100కు కాల్ చేసింది.. దీంతో కానిస్టేబుల్ జగన్ ఇంటికొచ్చి మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు.
ఆ తర్వాత తన దగ్గర డబ్బులు తీసుకొని తిరిగివ్వలేదు. చివరకు ఇంజాపూర్ తీసుకెళ్లి… pic.twitter.com/N5AecOs0Md
