గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2024 (13:13 IST)

డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన హెడ్ కానిస్టేబుల్.. ఎక్కడ?

head constable
ఇపుడు గుండెపోటు రావడానికి వయసుతో నిమిత్తం లేకుండా పోయింది. ఈ గుండెపోటు కారణంగా సంభవించే మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. తాజాగా ఢిల్లీలో ఓ యువ హెడ్ పోలీస్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఢిల్లీ రూప్ నగర్ పోలీస్ స్టేషనులో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవికుమార్.. స్టేషన్ హౌస్ అధికారి (ఎస్‌హెచ్) బదిలీ కావడంతో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యాడు. 
 
ఈ సందర్భంగా రవికుమార్ పలు పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో అతడి సహచరులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. రవికుమార్ చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు తమతో సరదగా ఉన్న కానిస్టేబుల్ మృతిచెందడంతో ఆయన మిత్రులు షాక్కు గురయ్యారు.
 
హెడ్‌కానిస్టేబుల్ డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భగాత్‌పూర్ చెందిన రవికుమార్ 2010లో ఢిల్లీ పోలీస్ విభాగంలో చని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 45 రోజుల క్రితమే రవికుమార్ గుండె పనితీరును తెలిపే యాంజియోగ్రఫీ పరీక్ష చేయించుకోవడం గమనార్హం.