శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2024 (21:43 IST)

ఇంద్ర రీ-రిలీజ్: రాధే గోవిందా పాటకు డ్యాన్స్ ఇరగదీసిన యువతి (వీడియో)

Radhe Govinda
Radhe Govinda
మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర రీ రిలీజ్‌తో మెగా ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. వయసుతో సంబంధం లేకుండా మెగా ఫ్యాన్స్ అంతా థియేటర్స్‌లో అదరగొడుతున్నారు. పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ.. డైలాగ్స్‌ను రిపీట్ చేస్తున్నారు. ఇది రీ-రిలీజా లేకుంటే తొలిసారి విడుదల అవుతుందా అనేలా సంబరాలు చేసుకుంటున్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి డ్యాన్సులు, ఫైట్లు, ఆర్తి అగర్వాల్, సోనాలి బెంద్రే గ్లామర్ అండ్ యాక్టింగ్‌తో పాటు కామెడీ సీన్స్, హెలికాప్టర్‌తో రైలును ఛేజ్ చేసే సీన్ అలాగే రాయల సీమ ఎపిసోడ్.. ప్రకాష్ రాజ్ గవర్నర్ అయిన తర్వాత చిరంజీవితో వచ్చిన సీన్.. ఇవన్నీ మరోసారి విజిల్ బ్లోయింగ్ అనిపించుకున్నాయి. 
ముఖ్యంగా ఇంద్రలోని చిరంజీవి- సోనాలి పాటకు థియేటర్లు సైతం అదిరిపోయేలా ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రాధే గోవిందా పాటకు థియేటర్స్‌లో విజిల్స్ మారు మోగిపోతున్నాయి. ఇలా ఓ మెగా అభిమాని రాధే గోవిందా పాటకు వేసిన స్టెప్పులతో కూడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అలాగే ఇంద్ర సినిమా థియేటర్లో ప్రదర్శిస్తుండగా 'అయ్యో అయ్యో అయ్యయ్యో' సాంగ్‌కి ఓ పెద్దాయన లేచి డ్యాన్స్ చేశారు. అసలు ఈ పాటకి అక్కడ చిరు వేసే స్టెప్పులు మానేసి ఆడియన్స్ ఇతన్ను చూడటం మొదలుపెట్టారు. అసలు ఆయన గ్రేస్, ఆ స్టెప్పులు చూసి కుర్రాళ్లు మతులుపోయాయి.