పిల్లలకు బిర్యానీ పెట్టి.. నీళ్లల్లో ముంచి చంపేశాడు.. ఆపై అతను కూడా?
Crime news
ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో కృష్ణ అతని భార్య సవితల మధ్య గొడవలు జరుగుతుండేవని.. పదేళ్ల క్రితం వీరికి వివాహం జరిగిందని తెలిసింది. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కృష్ణ తన పిల్లలు తన మరణానికి అనంతరం అనాధలుగా మారుతారనే ఉద్దేశంతో వారితో పాటే జలాశయంలోకి దూకి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనకు ముందు ప్రాజెక్టు సమీపంలో చెట్ల కింద పిల్లలు ఇద్దరికీ కడుపు నిండా బిర్యానీ పెట్టి.. కాసేపు జలాశయంలో ఆడుకోనిచ్చి.. ఆపై సెల్ఫీలు దిగి.. ఆ నీళ్లల్లోనే వాళ్లను ముంచి చంపేశాడు.
చివరికి తాను కూడా ఆ నీళ్లల్లో మునిగి మృతి చెందాడు. ఎంతసేపటైనా పిల్లలతో వెళ్లిన కృష్ణ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
