1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Schools Reopen with Breakfast Scheme

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం... బస్సు సేవలు కూడా..

Breakfast In Telangana Schools
తెలంగాణ వ్యాప్తంగా 52 రోజుల వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 12,437 మంది విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, కొత్త యూనిఫాంలు, విద్యార్థి కిట్‌ల పంపిణీతో రాష్ట్రం 2026-27 విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తోంది. అలాగే పాఠశాల మార్గాల్లో అదనపు టీజీఎస్సార్టీసీ బస్సు సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. 
 
ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభ తేదీని మార్చిన నేపథ్యంలో ఈ ఏర్పాట్లు జరిగాయి. సోమవారం నుంచి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలన్నింటిలోనూ తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి. అయితే, తేదీ మార్పు కారణంగా ఏర్పడిన సమయ వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు జూలై 11 (రెండవ శనివారం) పని దినంగా పరిగణించబడుతుంది. 
 
హైదరాబాద్ జిల్లాలోని 45 పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహార పథకం మొదటి దశ ప్రారంభం కానుంది.   పాఠశాల సమయం ప్రారంభం కావడానికి ముందే విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. ఈ మెనూలో చిరుధాన్యాల ఇడ్లీ-సాంబార్, పూరీ-మిశ్రమ కూరగాయల కుర్మా, బోండా-చట్నీ, ఉప్మా-చట్నీ, దోసె వంటివి ఉంటాయి. 
 
పాఠశాల మధ్యలో చదువు మానేసే వారి సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ ఉదయపు భోజన పథకాన్ని చేపట్టింది. పాఠశాలలు తిరిగి తెరుచుకునే రోజున హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 672 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు పంపిణీ చేయనున్నారు. 
 
గతంలో నడిపిన పాఠశాల మార్గాలను టీజీఎస్ఆర్టీసీ పునరుద్ధరిస్తుందని, అలాగే ఉదయం, సాయంత్రం సర్వీసులను పాఠశాల సమయాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తుందని అధికారులు తెలిపారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
విడాకుల కోసం వస్తే వివాహితను అలా వాడుకున్నాడు.. చివరికి?