1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana SSC Results to Be Declared Tomorrow at 2 PM

Telangana SSC Results: ఏప్రిల్ 29న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

Telangana SSC Results
Telangana SSC Results
పదో తరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 29, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 14న ప్రారంభమైన పదో పరీక్షలు, రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 13న ముగిశాయి. ఈ ఏడాది సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 
 
జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 23న పూర్తయింది. వాస్తవానికి ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేస్తామని అధికారులు ఇంతకుముందు సూచించినప్పటికీ, ప్రస్తుతం ఏప్రిల్ 29న వాటిని ప్రకటించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
కాగా, ఫలితాల వెల్లడి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించటంతో.. ఫలితాలను సైతం అదే విధంగా అందుబాటులోకి తీసుకు రావాలని డిసైడ్ అయింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇద్దరు కుమారులను హత్య చేశాడు.. ఆపై తండ్రి కూడా ఆత్మహత్య