సంబంధిత వార్తలు
- శుభవార్త చెప్పిన సీఎం జగన్ - 1998 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగులు
- 06-01-2023 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...
- అయోధ్యలో రామ మందిరం 2024 జనవరి 1న ప్రారంభిస్తాం.. అమిత్ షా
- అమేజాన్ సంచలన నిర్ణయం.. 18వేల మంది ఉద్యోగులపై వేటు
- కాల్‌గర్ల్ కోసం సెర్చ్ చేసి ... రూ.1.97 లక్షలు పోగొట్టుకున్న టెక్కీ
తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్ బీబీ 1.5 వేరియంట్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియింట్ వెలుగు చూసింది. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలను వణికించిన ఈ వైరస్ ఇపుడు భారత్‌లోకి కూడా ప్రవేశించింది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ అయిన ఎక్స్ బీబీ1.5ను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వైద్యులు గుర్తించారు.
అగ్రరాజ్యం అమెరికాలో గత కొన్ని రోజులుగా ఈ తరహా వేరియంట్‌కు చెందిన వైరస్ సోకుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్న విషంయం తెల్సిందే. ఇపుడు ఈ ఎక్స్ బీబీ 1.5 మన దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎన్‌ఎస్ఏసీఓజీ వెల్లడించింది.
కేంద్ర వైద్య శాఖ నివేదికల ప్రకారం ప్రస్తుతం గుజరాత్‌లో మూడు, తెలంగాణ, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ కేసులు నమోదయ్యాయి. ఎక్స్ బీబీ వేరియంట్ ఒమిక్రాన్ బీఏ 2.10.1, బీఏ 2.75 సబ్ వేరియంట్‌ల రీకాంబినెంట్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వెలుగుచూసిన కేసుతో పాటు ఇప్పటివరకు దేశంలో మొత్తం ఏడు కేసులను గుర్తించారు.
