శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (09:00 IST)

చంద్రబాబును చూస్తే వైకాపా నేతలకు లాగులు తడిపిపోతున్నాయ్.. : రామ్మోహన్ నాయుడు

rammohan naidu
తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూస్తే వైకాపా నేతలకు లాగులు తడిసిపోతున్నాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. అందుకే కుప్పంలో చంద్రబాబు నాయుడును అడ్డుకున్నారని, అది ప్రజాస్వామ్యానికే చీకటి రోజన్నారు. ఒక శాసనసభ్యుడిగా సొంత నియోజకవర్గం కుప్పంలో తిరిగేందుకు ఎవరి అనుమతి కావాలని ఆయన ప్రశ్నించారు. 
 
ప్రజాప్రతినిధులు సొంత నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లో తిరగకుండా అడ్డుకునేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీకటి జీవోలను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. చంద్రబాబును చూసి సీఎం జగన్ ఎంత భయపడిపోతున్నారో చెప్పడానికి ఇదొక్కటే నిదర్శనమన్నారు. 
 
జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా సర్వనాశనమైపోయిందని, అలాంటి రాష్ట్రాన్ని తిరిగిగాడిలో పెడతామని ప్రజల్లో ధైర్యం కల్పిస్తూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. చంద్రబాబు సభలకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారని, ఈ జనాలను చూసి జగన్ ఓర్వలేకే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని మండిప్డడారు. 
 
ఎపుడైతే ప్రజావేదికను కూల్చారో అపుడే రాష్ట్రం పతనం కావడం మొదలైందన్నారు. ఒక మాజీ సీఎం ఎక్కడకు వెళ్లినా పోలీసులు తగిన భద్రతను, బందోబస్తును కల్పించాలని అన్నారు. పోలీసులు సరైన భద్రత కల్పించి ఉంటే తొక్కిసలాట జరిగేవి కాదని రామ్మోహన్ నాయుడు అన్నారు.