శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

శుభవార్త చెప్పిన సీఎం జగన్ - 1998 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగులు

jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. గత 1998లో ఎంపిక అయిన డీఎస్సీ అభ్యర్థులకు త్వరగా పోస్టింగులు ఇవ్వాలంటూ ఆదేశించారు. ఆయన గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, బడిపిల్లలకు అందించే గోరుముద్ద పథకం అమలు, ఆహారం నాణ్యత వంటి అంశాల్లో ఏమాత్రం రాజీపడొద్దని ఆయన అధికారులను కోరారు. ముఖ్యంగా, 1998 డీఎస్పీ అభ్యర్థులకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. 
 
అలాగే పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండేలా చూసుకోవాలని, తద్వారా నాణ్యమైన బోధన అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. పాఠశాలల్లో పిల్లలందరి వద్ద డిక్షనరీలు ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేసించారు. డిక్షనరీలు లేని పిల్లలకు తక్షణం వాటిని అందజేయాలని కోరారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గోరుముద్ద పథకం కింద రాగి మాల్ట్ ఇవ్వాలని, వారానికి మూడు రోజులు పిల్లలకు గ్లాడు రాగి మాల్ట్ ఇవ్వాలని, పిల్లల్లో ఐరన్, కాల్షియం ధాతువుల లోపాన్ని ఇది అరికడుతుందని ఆయన చెప్పారు.