బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఏపీలో ముందస్తు ఎన్నికల తథ్యం : ఎంపీ రఘురామరాజు

raghurama krishnamraju
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 
 
కొత్త అప్పులకు జగన్ ప్రభుత్వం ఎదురు చూస్తోందని, ఏపీలో ప్రభుత్వ పథకాలకు సరిపడా నిధులు లేవన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వైకాపా ప్రభుత్వానికి వేరే ఆప్షన్ కనిపించడంలేదని రఘురామ వివరించారు. 
 
జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ మాట తప్పడం ద్వారా జగన్ ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ప్రజల పట్ల వైఖరి మార్చుకోవాలని జగన్ విజ్ఞప్తి చేస్తున్నట్టు రఘురామ తెలిపారు.