శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (20:45 IST)

ప్రతిపక్షాల దెబ్బకు వణికిపోతున్న సీఎం జగన్ : టీడీపీ నేత పట్టాభి

Pattabhiram
ప్రతిపక్షాల దెబ్బకు సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. అందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జంగిల్ రాజ్ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఇందులోభాగంగా జీవో నంబరు 1ను తీసుకొచ్చారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నపుడు జగన్ పాదయాత్రకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని, ఇపుడు అధికారంలో ఉన్న జగన్ ప్రతిపక్షాలు రోడ్లపై తిరిగితే ఎందుకు భయపడుతున్నారని అన్నారు. మన దేశంలో నంబర్ వన్ పిరికిపంద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. 
 
అందుకే ప్రతిపక్ష నేతలు రోడ్లపైకి వస్తుంటే భయంతో వణికిపోతూ, విపక్ష నేతలను అణిచివేసేందుకు బ్రిటీష్ కాలం నాటి చట్టాలను తెచ్చారంటూ మండిపడ్డారు. సైకో సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 
 
సైకో సీఎం జగన్ ఇంటికి పోవడం ఖాయం : చంద్రబాబు ఆగ్రహం 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న ఈ సైకో సీఎం జగన్ త్వరలోనే ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఆయన తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పర్యటనకు బుధవారం వచ్చారు. అయితే, చంద్రబాబు రోడ్‌షోను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
14 యేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆపుతారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన పెద్దూరులో పాదయాత్ర ప్రారంభించారు. మరోవైపు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచాలని, జగన్ నియంతృత్వ ధోరణిని, ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని టీడీపీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ ఇంటికి పోవడం ఖాయమని ఆయన చెప్పారు. 
 
అస్సలు సభలు, ర్యాలీలు నిర్వహించకుండా ఏ చట్టం ప్రకారం జీవో1 తెచ్చారని చంద్రబాబు పోలీసులను నిలదీశారు. ఇది ప్రజలు, ప్రజాస్వామ్య గొంతుకను నొక్కడమేనని, ఇలాంటి ఆటలు సాగనివ్వబోమని, తన రోడ్డు షోలపై ఏ చట్టం కింద పోలీసులు అభ్యంతరం చెపుతున్నారని సూటిగా ప్రశ్నించారు. అయితే, పోలీసులు చంద్రబాబు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకు బిక్కముఖం పెట్టారు.