ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

నేటి నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన

chandrababu
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి ఈ నెల 6వ తేదీ వరకు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. అలాగే కుప్పంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానిక టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లుచేశాయి. 
 
ఈ పర్యటన కోసం ఆయన ఉదయం 9.25గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 11.20 గంటలకు బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2.30 గంటలకు కుప్పంకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామం చేరుకుంటారు. రాత్రి 8 గంటల వరకు శాంతిపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటిస్తారు.
 
ఈ నెల 5వ తేదీన కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఆ రాత్రికి కుప్పం ఆర్ అండ్బి గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 6వ తేదీన గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. సాయంత్రం 6 గంటలకు పెద్దపర్తికుంట నుంచి బయల్దేరి బెంగుళూరు హెచ్.ఏ.ఎల్. విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి వస్తారు.