గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (15:55 IST)

గుంటూరు తొక్కిసలాట తర్వాత ఆస్పత్రికి మంత్రులు క్యూ కట్టారు.. కుట్ర ఉండొచ్చు : అచ్చెన్న

atchennaidu
గుంటూరులో ఉయ్యూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిగిన చంద్రన్న కానుకల పంపిణీలో తొక్కిసలాట జరగ్గా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటన తర్వాత క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైకాపా మంత్రులు క్యూ కట్టారు. దీనినిపై టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. 
 
తొక్కిసలాట ఘటన తర్వాత మంత్రులు ఆస్పత్రికి క్యూ కట్టడం వెనుక పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. పైగా, వేల మంది వచ్చిన ప్రాంతంలో పట్టుమని పది మంది కూడా పోలీసులు భద్రత కల్పించలేదని ఆయన ఆరోపించారు. అలాగే, తొక్కిసలాట సమయంలో పోలీసులు కూడా సరిగా విధులు నిర్వహించలేదని చెప్పారు. 
 
గుంటూరు ఘటనకు జగన్ ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమన్నారు. ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ పోలీసుల అనుమతితోనే ఈ సభను ఏర్పాటు చేసిందన్నారు. కానీ, వేలాది మంది జనం తరలివచ్చే ప్రాంతంలో కనీసం వంద మంది కూడా పోలీసులు లేరని అన్నారు. తోపులాట జరిగిన సమయంలో పోలీసులు కూడా సరిగా స్పందించలేదన్నారు. పైగా ఘటన జరిగిన వెంటనే మంత్రులు ఆస్పత్రికి క్యూ కట్టడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.