1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (21:46 IST)

అయోధ్యలో రామ మందిరం 2024 జనవరి 1న ప్రారంభిస్తాం.. అమిత్ షా

Lord Rama
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విరాళాలు ఇస్తున్నారు. రామజన్మభూమి భద్రత, రామమందిరం పవిత్రతను దృష్టిలో ఉంచుకుని 2021లోనే దేశవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు సమాచారం. 
 
దీంతో ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఆలయాన్ని ఎప్పుడు పునః ప్రారంభిస్తారని భక్తులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రామ ఆలయాన్ని తెరవడంపై కీలక ప్రకటన చేశారు. 
 
అందులో అయోధ్యలో నిర్మించనున్న రామమందిరాన్ని 2024 జనవరి 1న ప్రారంభిస్తామన్నారు. గత నవంబర్‌లో రామ మందిర నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ చెప్పారు. తాజాగా అమిత్ షా ప్రకటన రామ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.