సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 అక్టోబరు 2022 (10:44 IST)

అయోధ్యలో దీపావళి.. దీపోత్సవ్.. మ్యూజికల్ లేజర్ షో.. మోదీ హాజరు

Ayodhya
Ayodhya
యూపీలోని అయోధ్యలో దీపావళిని పురస్కరించుకుని దీపోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా 18 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనున్నారు. బాణసంచాను పెద్ద ఎత్తున కాల్చడంతోపాటు మ్యూజికల్‌ లేజర్‌ షోనూ నిర్వహించనున్నారు. 
 
రామ్‌లీలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. హారతి కార్యక్రమం నిర్వహించేందుకు సరయూ నది తీరప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. 
 
ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో ఈరోజు 15 లక్షల దీపాల వెలుగుల కార్యక్రమం నిర్వహించనున్నారు. పీఎం నరేంద్ర మోదీ భగవాన్ శ్రీ రామ్‌లాలా విరాజ్‌మాన్ దర్శనం చేస్తారు. ఆపై పూజను కూడా నిర్వహిస్తారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర స్థలాన్ని మోదీ ఈ సందర్భంగా పరిశీలిస్తారు.