శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (19:53 IST)

మార్చిలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌..

Simple One e-scooter
Simple One e-scooter
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చే మార్చిలో విడుదల కానుంది. బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ నుంచి ఈ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది.  సింపుల్ వన్ ఒక్కసారి చార్జ్ చేస్తే 236 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఒక్కసారి చార్జ్‌తో 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. 
 
తమిళనాడులో రూ.100 కోట్ల పెట్టుబడితో సింపుల్ వన్ ఓ అతిపెద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ పది లక్షల వాహనాలు తయారు అవుతాయి. 2023 జనవరి 19న తయారీ మొదలు కానుంది. ఆపై మార్చి నుంచి స్కూటర్లను డెలివరీ చేస్తుంది.
 
సింపుల్ ఎనర్జీ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్‌లను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నో, భువనేశ్వర్‌లతో సహా పన్నెండు నగరాల్లో నిర్వహించారు. 
 
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ వరల్డ్ రేంజ్ 203కిమీ ఉన్న స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1,09,999 (ఎక్స్-షోరూమ్), 300కిమీ కంటే ఎక్కువ దూరం ఉండే లాంగ్-రేంజ్ వేరియంట్ ధర రూ.1,44,999 (ఎక్స్-షోరూమ్)గా వుంటుందని తెలుస్తోంది. ఈ వాహనాన్ని రూ.1,947తో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.